
పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్, ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయాలి. ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి భయ్య అభిమన్యు
పయనించే సూర్యుడు మార్చి 11 టేకులపల్లి ప్రతినిధి (పొనకంటి ఉపేందర్ రావు)
టేకులపల్లి SFI మండల కమిటీ ఆధ్వర్యంలో స్థానిక సిపిఎం పార్టీ కార్యాలయం లో ముఖకరక్తల సమావేశం ఏర్పాటు చేశారు .ఈ సందర్భంగా SFI జిల్లా కార్యదర్శి బయ్య అభిమన్యు మాట్లాడుతూ…
తెలంగాణ రాష్ట్రంలో పెండింగ్లో ఉన్న 6500 కోట్ల రూపాయల స్కాలర్షిప్ మరియు ఫీజు రీయింబర్స్మెంట్ విడుదల చేయాలని. రాష్ట్ర బడ్జెట్లో విద్యారంగానికి 30 శాతం నిధులు కేటాయించాలని. ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు అదేవిధంగా జిల్లా పరిధిలో ప్రభుత్వ పాఠశాలలో గురుకులాల మరియు ఆశ్రమ పాఠశాలలో మౌలిక సదుపాయాలు కల్పించాలని. జిల్లాలో అద్దే భవనాలలో నిర్వహిస్తున్న వసతి గృహాలకు సొంత వాహన నిర్మించాలని ప్రభుత్వ పాఠశాలలో మధ్యాహ్నం భోజనం పథకం సక్రమంగా అమలు అయ్యేలా చూడాలని డైట్ చార్జీలు పెంచే విధంగా చర్యలు తీసుకోవాలని అన్నారు. జిల్లాలో ఉన్నటువంటి ఆశ్రమ పాఠశాలలో ఇతర వసతి గృహాలలో సక్రమంగా మెనూ అమలు అయ్యేలా అధికారులు పర్యవేక్షణ పెరిగేలా చర్యలు తీసుకోవాలని. పదవ తరగతి విద్యార్థులకు నాణ్యమైన అల్ప ఆహారం అందించాలని. ప్రైవేటు కార్పొరేట్ పాఠశాలలు కళాశాలలో ముందస్తు అడ్మిషన్ల ప్రక్రియ నియంత్రించాలని. ప్రైవేటు విద్యాసంస్థల్లో ఫీజులు నియంత్రించాలని డిమాండ్ చేశారు.. టేకులపల్లి ప్రభుత్వ జూనియర్ కళాశాల నూతన భవనం నిర్మించాలనీ అభివృద్ధి కోసం 10.కోట్లు కేటయించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ మండల నాయకులు.. వెంకటేష్ కరుణాకర్ కుమార్ నాగరాజు తదితరులు పాల్గొన్నారు…