( పయనించే సూర్యుడు అక్టోబర్ 30 షాద్ నగర్ నియోజకవర్గం ఇన్చార్జ్ నరేందర్ నాయక్)
తెలంగాణ రాష్ట్ర బీసీ జేఏసీ చైర్మన్ ఆర్ కృష్ణయ్య ఈరోజు జాతీయ బీసీ సేన అధ్యక్షులు బర్క కృష్ణ ను తెలంగాణ రాష్ట్ర బీసీ జేఏసీ కన్వీనర్ గా నియమించడం జరిగినది.ఈ కార్యక్రమానికి బీసీ నాయకులు జేఏసీ నాయకులు, బీసీ నాయకులు, జాతీయ బీసీ సేన అధ్యక్షులు బర్క కృష్ణకు అభినందనలు తెలియజేశారు. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర బీసీ జేఏసీ అధ్యక్షులుగా నియమితులైన బర్క కృష్ణ మాట్లాడుతూ తనపై పూర్తి నమ్మకంతో రాష్ట్ర జేఏసీ అధ్యక్షులుగా నియమించినందుకు జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్యకు ధన్యవాదాలు తెలియజేస్తూ 42 శాతం బీసీ రిజర్వేషన్ సాధించేంతవరకు అవిశ్రాంతంగా పోరాటం చేస్తామని, అన్ని కులాలను అన్ని వర్గాలను అన్ని పార్టీలను కలుపుకొని పోయి బీసీల అభ్యున్నతికై పాటుపడతానని, బీసీలకు అందాల్సిన అన్ని సంక్షేమ ఫలాలు అందేంతవరకు ముందు తానే నడుస్తానని, బీసీల సంరక్షణ ధ్యేయంగా పూర్తి నమ్మకం మరియు విశ్వాసంతో పని చేస్తానని, బీసీలకు రాజ్యాధికారం దిశగా అన్ని వర్గాలను కలుపుకొని పోతానని బీసీల సంపూర్ణ అభివృద్ధి తన ధ్యేయమని అన్నారు.ఈ కార్యక్రమంలో నియోజకవర్గం అధ్యక్షులు కత్తి చంద్రశేఖరప్ప మహిళలు పెద్దలు బీసీ సేన షాద్ నగర్ నియోజకవర్గం బీసీ నేతలు కృతజ్ఞతలు తెలియజేశారు.

