
పయనించే సూర్యుడు మే ఒకటి నిజామాబాద్ జిల్లా బ్యూరో టికే గంగాధర్
జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు మానాల మోహన్ రెడ్డి
కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నందు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు,రాష్ట్ర సహకార యూనియన్ లిమిటెడ్ చైర్మన్ మానాల మోహన్ రెడ్డి,రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహేర్ బిన్ హందాన్ విలేకరుల సమావేశం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు మానాల మోహన్ రెడ్డి మాట్లాడుతూ నిన్నటి రోజు జనగణనలో భాగంగా కుల గణన కూడా చేస్తామని చెప్పి కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన తీరు అభినందనియం అని,దేశంలో కులగణనకు కేంద్ర ప్రభుత్వం ఒప్పుకోవడం అనేది ప్రజల పక్షాన 5 సంవత్సరాలు నిరంతరం కేంద్రం పై ఒత్తిడి తెచ్చిన నాయకులు రాహుల్ గాంధీ కే ఈ ఘనత దక్కుతుంది అని అన్నారు. దేశంలో ఎవరి వాట ఎంతనొ వారు తీసుకోవాలని ఆలోచించే వ్యక్తి రాహుల్ గాంధీ ,సంపన్నుల కంటే పెదవారి కోసం ఎక్కువ ఆలోచన ఉన్న వ్యక్తి రాహుల్ గాంధీ ,దేశ స్వాతంత్యంలో ప్రాణాలు అర్పించిన కుటుంబం నుండి వచ్చిన వ్యక్తిగా దేశంలో కులగణన జరుగుతేనే ఓబీసీలకు న్యాయం జరుగుతుందని నమ్మిన వ్యక్తి రాహుల్ గాంధీ అని అన్నారు.కులగణన చేసే ప్రక్రియలో అన్ని వర్గాల వారి ఆలోచన తీసుకొని దానికి అన్ని రకాలుగా సబ్ కమిటీ ఏర్పాటు చేసి వేలాది మంది నిర్ణయాలు తీసుకొని కులగణనా చేసిన ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం అని,అందుకే రాహుల్ గాంధీ దేశంలో కులగణన చేసే ప్రక్రియలో తెలంగాణను రోల్ మోడల్ గా తీసుకోవాలని చెప్పడం జరిగిందనీ,దేశానికే రాష్ట్రాన్ని రోల్ మోడల్ గా చేసిన రేవంత్ రెడీ కి సహచర మంత్రి వర్గానికి కృతజ్ఞతఃలు తెలుపుతున్నమ్మనారు. కానీ రాహుల్ గాంధీ కులగణన చేయాలని అన్నప్పుడు చాలా మంది బీజేపీ నాయకులూ కులగణన అవసరం లేదన్నారు అని, ఓబీసీ ల హక్కుల గురించి వారికి జరుగుతున్న అన్యాయాల గురించి తెలియని కేవలం పేరుకే ఓబీసీగా ఉంది గోల్డెన్ స్పూన్ లో పుట్టిన స్థానిక పార్లమెంటు సభ్యులు అరవింద్ ఇప్పుడు మొకం ఎక్కడ పెట్టుకుంటాడు అని ప్రశ్నించారు. దేశం మొత్తం కులగణన జరగాలని కేంద్రంపై ఒత్తిడి తెచ్చి, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో కచ్చితంగా కులగణనా చేసి తీరుతామని చెప్పిన రాహుల్ గాంధీ ఆలోచన ప్రకారం కామారెడ్డి డిక్లరేషన్ లో చెప్పిన విధంగా రాహుల్ గాంధీ ఆలోచన మేరకు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆయన సహచర మంత్రివర్గం తెలంగాణ రాష్ట్రంలో విజయవంతంగా కులగణన పూర్తి చేయడం జరిగిందని అన్నారు.అందుకే కేంద్ర ప్రభుత్వం కులగణన చేసే ప్రక్రియలో తెలంగాణూ రోల్ మోడల్ గా తీసుకోవాలని రాహుల్ గాంధీ చెప్పడం జరిగిందనీ,దేశం మొత్తం కులగణన అమలు చేయడం అనేది రాహుల్ గాంధీ మరియు దేశ ప్రజల విజయమని మానాల మోహన్ రెడ్డి అన్నారు. ఈ సందర్భంగా తాహెర్ బిన్ హందాన్ మాట్లాడుతూ రాహుల్ గాంధీ గారు ఆయన ఆలోచన సరళితో దేశంలో కన్యాకుమారి నుండి కాశ్మీర్ వరకు పాదయాత్ర చేశారు.అందులో భాగంగా రాహుల్ గాంధీ ఆలోచన మేరకు ఎవరు ఏమనుకున్నా తెలంగాణలో కులగణన చేసి తీరుతామని రేవంత్ రెడ్డి ఆయన సహచర మంత్రులు కులగణన పూర్తి చేశారు. దాని ఆధారంగా దేశంలో కులగణన చేయాలని,రాహుల్ గాంధీ ఆలోచన గుర్తించి కులగణనా అవసరమని భావించి దేశం మొత్తం కులగనానా చేయాలని కేంద్రం ప్రకటించడం నిజంగా రాహుల్ గాంధీ విజయమని అన్నారు. రాహుల్ గాంధీ మాటలను కేవలం ఎన్నికల కొరకు అని ఎగతాలో చేశారు కానీ ఆయన మాటల ప్రకారమే దేశం మొత్తం కులగణన చేయాలని కేంద్ర ప్రభుత్వం ఆలోచించింది అని,కామారెడ్డి డిక్లరేషన్ ఆధారంగా కులగణన చేస్తామని అన్నప్పుడు అందరూ నవ్వినారు కానీ ఇప్పుడు రాష్ట్రంలో విజయవంతనగ్ కులగణన అమలు అయిన తీరు అందరూ అభినందిస్తున్నారు అని అన్నారు.దేశం మొత్తం కులగణన అమలు చేయడం అనేది కాంగ్రెస్ విజయం అని, తెలంగాణ ను దేశ మొత్తం రోల్ మోడల్ చూసే విధంగా చేసిన రేవంత్ రెడీ కి, ఆయన సహచర మంత్రి వర్గానికి కృతజ్ఞతఃలు తెలిపారు.ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ చైర్మన్ అంతరెడ్డి రాజారెడ్డి,రాష్ట్ర ప్రచార కమిటీ మెంబర్ జావిద్ అక్రమ్,సీనియర్ కాంగ్రెస్ నాయకులు రత్నాకర్,జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు విపుల్ గౌడ్,జిల్లా ఓబీసీ అధ్యక్షులు నరేందర్ గౌడ్, జిల్లా సేవాదళ్ అధ్యక్షులు సంతోష్,జిల్ల ఎస్టి సెల్ అధ్యక్షులు యాదగిరి,సాయి కిరణ్,శివ మరియు తదితరులు పాల్గొన్నారు