పయనించే సూర్యుడు గాంధారి 26/01/25. గణతంత్ర దినోత్సవం ను పురస్కరించుకొని నిర్వహించే రిపబ్లిక్ డే పరేడ్ కి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల పెట్ సంగం లో పదవతరగతి వరకు చదివిన వాలీబాల్ క్రీడాకారిణి దరావత్ మౌనిక పాల్గొన్నట్లు వ్యాయామ ఉపాధ్యాయుడు లక్ష్మణ్ రాథోడ్ తెలిపారు. కామారెడ్డి అర్థ్స్ అండ్ సైన్స్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల కామారెడ్డి లో ద్వితీయ సంవత్సరం చదువుతున్న ఆమె మొదటి నుండి క్రీడలో చదువుల్లో చురుకుగా ఉండేది, మౌనిక ఆదివారం భారత ప్రధాని నరేంద్రమోడీ హాజరు అయిన పరేడ్ కూ ఎన్ సి సి విభాగంలో మౌనిక తెలంగాణ నుండి ప్రాతినిద్యం వహించింది, ఎన్ సి సి లో శిక్షణ పొందే ప్రతి క్యాడెట్ ఢిల్లీ పరేడ్ కూ ఎంపిక అవ్వడానికి చాలా కష్ట పడుతారు, మౌనికకి ద్వితీయ సంవత్సరం లోనే అవకాశం రావడం గొప్ప విషయం అని ఆమెకి చదువు చెప్పిన ఉపాద్యాయులు కొనియాడారు. ఆమె ఎంపిక పట్ల ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు.
రిపబ్లిక్ డే పరేడ్ కి పెట్ సంగం పూర్వ విద్యార్థి
RELATED ARTICLES