
రుద్రూర్, సెప్టెంబర్ 20 (పయనించే సూర్యుడు, రుద్రూర్ మండల ప్రతినిధి) :
భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ జన్మదిన వేడుకల్లో భాగంగా శనివారం రుద్రూర్ బస్టాండ్ ప్రాంగణంలో స్వచ్ఛభారత్ సేవ పక్వాడ్ కార్యక్రమంలో భాగంగా భారతీయ జనతా పార్టీ రుద్రూర్ మండల అధ్యక్షులు ఆలపాటి హరికృష్ణ ఆధ్వర్యంలో బస్టాండ్ పరిసర ప్రాంతాలు శుభ్రం చేసి, రుద్రూర్ చౌరస్తాలోని చత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహం చుట్టూ చెత్తను తొలగించి శుభ్రపరచడం జరిగిందాన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కౌన్సిల్ మెంబర్ ప్రశాంత్ గౌడ్ నియోజవర్గ సీనియర్ నాయకులు, మార్కెల్లి ప్రకాష్ పటేల్, పార్వతి మురళి, మండల ప్రధాన కార్యదర్శి వడ్ల సాయినాథ్, ఉపాధ్యక్షులు కృష్ణంరాజు, రేపల్లె సాయి ప్రసాద్,కన్నె శ్రీనివాస్,నితిన్, మహేందర్, బూత్ అధ్యక్షులు ఏముల అశోక్, మండల సీనియర్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.