
1).బొప్పాపూర్ గ్రామానికి వెళ్లే లో లెవెల్ బ్రిడ్జిని పరిశీలిస్తున్న తహసిల్దార్, ఎస్సై..
2). రుద్రూర్-బొప్పాపూర్ గ్రామానికి వెళ్లే రహదారి పై భారీ కేట్లు మూసివేసిన దృశ్యం ..
రుద్రూర్, జూలై 26 (పయనించే సూర్యుడు, రుద్రూర్ మండల ప్రతినిధి) :
రుద్రూర్ మండలంలోని బొప్పాపూర్ గ్రామానికి వెళ్లే గుండ్ల వాగు గత మూడు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు నిండిపోయి లోలెవెల్ బ్రిడ్జి పై నుండి నీరు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. గుండ్ల వాగు లోలెవెల్ బ్రిడ్జిని శనివారం తహసీల్దార్ తారాబాయి, ఎస్సై సాయన్న సందర్శించారు. కురుస్తున్న వర్షానికి లోలెవెల్ బ్రిడ్జి పైనుండి వర్షపు నీరు ఉదృతంగా ప్రవహించడంతో రుద్రూర్- బొప్పాపూర్ గ్రామానికి వెళ్లే రహదారి పై భారీ కెట్లు ఏర్పాటు చేసి రాకపోకలు నిలిపివేశారు.