
రుద్రూర్, ఏప్రిల్ 05 (పయనించే సూర్యుడు, రుద్రూర్ మండల ప్రతినిధి)
రుద్రూర్ మండల కేంద్రంతో పాటు అంబం(ఆర్) గ్రామంలో శనివారం బాబు జగ్జీవన్ రామ్ జయంతి వేడుకలను బ్లాక్ కాంగ్రెస్, మండల కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులుర్పించారు. స్వాతంత్ర సమరయోధుడిగా, ఉప ప్రధానిగా దేశానికి అందించిన విశేష సేవలను గుర్తు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు తోట అరుణ్ కుమార్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు ఇందూరి చంద్రశేఖర్, సొసైటీ చైర్మన్ సంజీవ్ రెడ్డి, కాంగ్రెస్ నాయకులు షేక్ నిస్సార్, ఇందూర్ కార్తిక్, కర్క అశోక్, సోషల్ మీడియా ఇంచార్జ్ వడ్ల నరేష్ తదితరులు పాల్గొన్నారు.