
బిజేపి పార్టీ జెండా ఆవిష్కరిస్తున్న దృశ్యం..
రుద్రూర్, ఏప్రిల్ 06 (పయనించే సూర్యుడు, రుద్రూర్ మండల ప్రతినిధి) :
రుద్రూర్ మండల కేంద్రంలోని చౌరస్తా ప్రాంగణంలో ఆదివారం 45 వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. అనంతరం బీజేపీ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్బంగా రుద్రూర్ మండల అధ్యక్షులు ఆలపాటి హరికృష్ణ మాట్లాడుతూ.. 45 వ భారతీయ జనత పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు రుద్రూర్ మండలంలో అన్ని గ్రామాలల్లో చేసుకోవడం జరిగిందన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశ ప్రజల ఆదరణ చాలా ఉందని, మోదీజి నాయకత్వంలో దేశం చాలా బాగా అభివృద్ధి చెందుతుందన్నారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో తప్పకుండ తెలంగాణ అంతటా బీజేపీ పార్టీ నాయకులను గెలిపించుకుంటామన్నారు. రుద్రూర్ లో కూడా ఎంపీటీసీ లు జడ్పీటీసీ, ప్రతి గ్రామంలో పోటీలో ఉంటామని రుద్రూర్ గ్రామం సర్పంచ్ కూడా తప్పకుండ బీజేపీ పార్టీ గెలుస్తుందని ఆయన స్పష్టం చేశారు. తెలంగాణ రాష్ట్రంలో 2028 నాటికీ బీజేపీ తప్పకుండ విజయాబేరి మోగిస్తుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కౌన్సిల్ మెంబర్ ప్రశాంత్ గౌడ్, మండల ప్రధాన కార్యదర్శిలు ఏముల గజేందర్, వడ్లసాయినాథ్, మండల యువ మోర్చా అధ్యక్షులు కుమ్మరి గణేష్, మండల ఎస్సీ మోర్చా అధ్యక్షులు శివప్రసాద్, మండల సీనియర్ నాయకులు జీలకర్ర విజయ్, కటికే రామ్ రాజ్, చీదుర మహిపాల్, వినోద్ కుమార్, శ్రీకాంత్, నర్వాడి వినోద్ కుమార్, బోజిగొండ అనిల్,గంగాధర్, రవి, బిజెపి సీనియర్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.