
రుద్రూర్, అక్టోబర్ 18 (పయనించే సూర్యుడు, రుద్రూర్ మండల ప్రతినిధి) :
బీసీలకు 42 శాతం రిజర్వేషన్లకు చట్టబద్ధత కల్పించాలని బీసీ జేఏసీ, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఆదేశానుసారం రుద్రూర్ మండల కేంద్రంలో శనివారం బంద్ పాటించారు. ఈ సందర్భంగా బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఇందూరి చంద్రశేఖర్ మాట్లాడుతూ.. బీసీలకు అనగదొక్కే ఏపార్టీ అయినా రానున్న స్థానిక ఎన్నికల్లో ఓట్ల రూపంలో బీసీలు గట్టి బుద్ధి చెప్తారని ఆయన తెలిపారు. అనంతరం కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపి పార్టీ నాయకులు బైక్ ర్యాలీ నిర్వహించి మండల కేంద్రంలోని పాఠశాలలను బంద్ చేయించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు తోట అరుణ్ కుమార్, కాంగ్రెస్ పార్టీ నాయకులు షేక్ నిస్సార్, పట్ల సురేష్, ఇందూర్ కార్తిక్, మాజీ ఎంపీటీసి గౌస్, కమ్మరి శివ, గాండ్ల శ్రీను, రజక్, పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.