
రుద్రూర్, సెప్టెంబర్ 4 (పయనించే సూర్యుడు, రుద్రూర్ మండల ప్రతినిధి) :
రుద్రూర్ గ్రామంలోని శ్రీ సార్వజనిక్ గణేష్ మండలి 75వ వజ్రోత్సవ కార్యక్రమంలో భాగంగా జహీరాబాద్ మాజీ ఎంపీ బీవీ పటేల్ గురువారం గణనాథునికి ప్రత్యేక పూజలు, మంగళహారతులు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం బీవి పటేల్ కు గణేష్ మండలి నిర్వాహకులు శాలువాతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఆలయ పూజారి రాము శర్మ, బాన్సువాడ నియోజకవర్గ బిజెపి పార్టీ నాయకులు, ఎన్ఆర్ఐ కోనేరు శశాంక్, మండల అధ్యక్షులు ఆలపాటి హరికృష్ణ, జిల్లా కౌన్సిల్ మెంబర్ ప్రశాంత్ గౌడ్, బిజెపి నాయకులు పార్వతి మురళి, ఎముల గజేందర్, వడ్ల సాయినాథ్, కటిక రామ్ రాజ్, కృష్ణంరాజు, పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.