
పయనించే సూర్యుడు మే 8 (ఆత్మకూరు నియోజవర్గం ప్రతినిధి మన్నేపల్లి తిరుపతయ్య)
సోమశిల జలాశయం నుండి సాగునీటికి నీటి విడుదల చేసిన రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి. ఐఏబి సమావేశం నిర్ణయంతో బుధవారం జిల్లాలోని పంటల అవసరం నిమిత్తం మంత్రి ఆనం జలాశయం అధికారులతో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించి పెన్నా నది నీటిలో పూజా సామాగ్రిని వదిలి నీటిని విడుదల చేశారు. రెండవ పంట సాగుకు నార్త్ ఫీడర్ కెనాల ద్వారా 300 క్యూసిక్కులు, డెల్టాకు 500 క్యూసిక్కులు నీటి విడుదల చేసిన మంత్రి ఆనం. ఆయన వెంట సోమశిల ప్రాజెక్టు అధికారులు. తదితరులు పాల్గొన్నారు
