
రీకాలింగ్ చంద్రబాబు మేనిఫెస్టో క్యూ ఆర్ కోడ్ ఆవిష్కరణ
పయనించే సూర్యుడు జూలై 26 (ఆత్మకూరు నియోజవర్గం ప్రతినిధి మన్నేపల్లి తిరుపతయ్య)
కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాదికాలం పూర్తయినా ఎలాంటి అభివృద్ధి సంక్షేమ పథకాలు ప్రజలకు చేరువకాలేదని. రెడ్ బుక్ రాజ్యాంగం మాత్రమే రాష్ట్రంలో కనిపిస్తుందని వైఎస్సార్సీపీ నాయకులు పేర్కొన్నారు. వైస్సార్సీపీ అధ్యక్షులు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు మాజీ ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డి సూచనలతో రీకాలింగ్ చంద్రబాబు మేనిఫెస్టో క్యూ ఆర్ కోడ్ ఆవిష్కరణ పట్టణంలోని మేకపాటి విక్రమ్ రెడ్డి కార్యాలయంలో శుక్రవారం ఆత్మకూరు రూరల్ మండల నాయకులు నిర్వహించారు.ఈసందర్బంగామాట్లాడుతూ అధికారంలోకి రాకముందు చంద్రబాబు 143 హామీలు ప్రజలపై గుప్పించారని. గతంలో బాబు గురించి తెలిసినా మారానని చెప్పిన ఆయన మాటలను విశ్వసించి గత ఏడాది అధికారం అప్పగించారన్నారు.అయితే ఇచ్చిన హామీలు నెరవేర్చకపోగా సూపర్ సిక్స్ హామీలు అన్ని అమలు చేశామని ఆ పార్టీ నాయకులు ప్రకటించడం హాస్యాస్పదంగా ఉందన్నారు.కొందరి ముఖ్యమంత్రుల పరిపాలన గుర్తుకు వస్తే వారు చేసిన మంచి పనులు ప్రజల్లో నేటికీ స్థిరంగా నిలిచిపోయాయని, అవే గుర్తుకు వస్తాయన్నారు.అయితే చంద్రబాబు పాలనను గుర్తు చేసుకుంటే అబద్దాలు, మోసపు మాటలు చెప్పడం, అధికారంలోకి వచ్చాక చేతులెత్తేయడం లాంటివే గుర్తుకు వస్తున్నాయన్నారు.గత జగనన్న పాలనలో విజయవంతంగా అమలైన పథకాలకు పేర్లు మార్చి తానూ అమలు చేస్తానని చెప్పుకున్న చంద్రబాబు ఆ పథకాలకు మంగళం పాడారన్నారు.మరో వైపు టీడీపీ సీనియర్ నాయకులు మహిళలకు ఇచ్చిన హామీలు అమలు చేయాలంటే రాష్ట్రాన్ని అమ్మేయాల్సిందేనని చెప్పడం చూస్తే ప్రజలు వారి హామీల అమలు తీరుపై మండిపడుతున్నారన్నారుజగనన్న పాలనలో అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తూ నెలకో పథకం ద్వారా ప్రజల ఆర్థిక పరిస్థితి మెరుగయ్యేలా చేశారన్నారు.అయితే కూటమి ప్రభుత్వం అమలు చేయలేక చేతులెత్తేయడంతో ప్రజల ఆర్థిక పరిస్థితి తిరోగమనం దిశలో ఉందని, దీంతో వ్యాపారాలు సైతం పూర్తిగా దెబ్బతిని వర్గాలు ఆందోళన చెందుతున్నాయని ఆయన పేర్కొన్నారు.ప్రశ్నిస్తే అక్రమ అరెస్ట్లు, నిజాయితీ గల ప్రతిపక్ష నాయకులను జైలు పాలు చేయడం తప్ప చంద్రబాబు పాలనలో ప్రజలకు మంచి ఏమి జరిగిందని ఆయన ప్రశ్నించారు.ఈ నెల 28న మాజీ ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డి ఆధ్వర్యంలో రీకాలింగ్ చంద్రబాబు మేనిఫెస్టో నియోజకవర్గ స్థాయి విస్తృత స్థాయి సమావేశం జరగనుందని ఆయన తెలిపారు. అందరూ పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.ఈకార్యక్రమంలో నియోజకవర్గ పంచాయతీరాజ్ విభాగం కన్వీనర్ బొమ్మిరెడ్డి రవికుమార్ రెడ్డి, రూరల్ మండల పార్టీ నాయకులు సానా వేణుగోపాల్ రెడ్డి, గడ్డం శ్రీనివాసులు రెడ్డి, సర్పంచులు బీ వెంకటేశ్వర్లు, ఎం సతీష్, కోనేపల్లి సుబ్బారెడ్డి, గిరి నాయుడు, దాడి శ్రీనివాసులు నాయుడు, హజరత్ నాయుడు, తోడేటి అశోక్, పూర్ణ చంద్రరావు, మస్తానయ్య, మాధవ, బుజ్జయ్య, పవన్, తదితరులు పాల్గొన్నారు.