
షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్
( పయనించే సూర్యుడు మే 13 షాద్ నగర్ నియోజకవర్గం ఇన్చార్జ్ నరేందర్ నాయక్ )
కొందుర్గ్ మండలంలోని విశ్వనాథ్ పూర్,వెంకిర్యాల గ్రామాల్లో నిర్వహించిన రెవిన్యూ సదస్సు కి షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ హాజరయ్యారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే, ప్రభుత్వ రంగ సంస్థల కమిటీ చైర్మన్ వీర్లపల్లి శంకర్ మాట్లాడుతూ.. ప్రజా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకువచ్చిన భూభారతి చట్టం ద్వారా రైతులకు ఎంతో మేలు జరుగుతుందని అన్నారు.జిల్లాలోనే పైలట్ ప్రాజెక్టుగా కొందుర్గ్ మండలం ను ఎంపిక చేశారు.కావున భూ సమస్యలు ఉంటే పరిష్కరించుకోవడానికి రైతులు,భూ యజమానులు సదవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు.భూ భారతి చట్టం అనేది మేధావులు, రైతు సంఘాలు, అందరితో చర్చించి గత చట్టంలోని లోపాలను సవరిస్తూ కొత్త చట్టం భూ భారతిని తీసుకు వచ్చిందన్నారు. అన్నిరకాల భూసమస్యలు పరిష్కరించడమే కాకుండా వారికి భూధార్ కార్డును కూడా ఇవ్వడం జరుగుతుందన్నారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షుడు కృష్ణ రెడ్డి,తహసీల్దార్ రమేష్ కుమార్, దామోదర్ రెడ్డి,గోవర్ధన్ గౌడ్,మల్లేష్ గౌడ్,లింగం గౌడ్, మాసయ్య, రామకృష్ణ రెడ్డి, కరుణాకర్ రెడ్డి, యాదయ్య, కృషయ్య,తదితరులు పాల్గొన్నారు.
