ప్రజా సంక్షేమం, అభివృద్ధి లక్ష్యంగా సేవలు
*పయనించే సూర్యుడు. జనవరి 25. ఖమ్మం జిల్లా బ్యూరో ఇంచార్జ్. గుగులోత్ భావుసింగ్ నాయక్*
ఏన్కూరు మండలం ప్రజల సంక్షేమం, అన్ని రంగాల్లో అభివృద్ధి లక్ష్యంగా సేవలు అందిస్తున్నామని ఆదివారం గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఏన్కూర్ మండలం కేంద్రంలోని రేపల్లెవాడ గ్రామపంచాయతీలో ఇందిరమ్మ ఇండ్లు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రైతు భరోసా నూతన రేషన్ కార్డుల జారీ వంటి నాలుగు ప్రజా ఉపయోగకరమైన కార్యక్రమాలను గణతంత్ర దినోత్సవం సందర్భంగా నేడు ప్రారంభించుకోవడం సంతోషంగా ఉందని, మండల అధికారి ఎంపీడీవో రమేష్ ఎమ్మార్వో శేషగిరిరావు తెలపడం జరిగింది అర్హులైన చివరి లబ్ధిదారుడి వరకు ప్రతి సంక్షేమ పథకం అమలవుతుందని, ఎవరూ ఎటువంటి ఆందోళన చెందవలసిన అవసరం లేదని అన్నారు. అర్హులైన వారికి గ్రామసభ నిర్వహించి నాలుగు పథకాలకు సంబంధించి లబ్ధిదారులకి పత్రాలను అందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో రమేష్ ఎమ్మార్వో శేషగిరిరావు ఎంపీఓ జీవీఎస్ నారాయణ ఏపీవో సూరయ్య పిఆర్ఏఈ అనూష కాంగ్రెస్ మండల అధ్యక్షులు స్వర్ణ నరేందర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మేడ ధర్మారావు చిన్నస్వామి అజ్మీర సురేష్ నిమ్మల నరేందర్ మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు నిమ్మల నాగేశ్వరరావు గ్రామ పంచాయతీ సిబ్బంది ఈజీఎస్ సిబ్బంది మండల ఆఫీసు అధికారులు గ్రామ ప్రజలు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది