
పయనించే సూర్యుడు రిపోర్టర్ జల్లి నరేష్ చింతూరు డివిజన్ ఇంచార్జ్ ఆగస్టు 7 అల్లూరి సీతారామరాజు జిల్లా చింతూరు మండలం సుద్ద గూడెం గ్రామంలో ఆదివాసీ జెండా ను ఏ గ్రామ పూజారి,పెద్దలతో ఎగారావేయడం జరిగింది ఇందులో ఆదివాసి జేఏసీ డివిజన్ చైర్మన్ జల్లి నరేష్ ఉద్యోగ సంఘ నాయకులు తిమ్మా సాయి వెంకటరమణ మాట్లాడుతూ ఆగస్టు 1 నుండి 9 తారీకు వరకు ప్రతి గ్రామంలో కూడా ఆదివాసి జండాలను ఆదివాసి యువతీ యువకులు ప్రజలు స్వచ్ఛందంగా గ్రామాల్లో ఎగురవేయాలని ఆయన అన్నారు అదేవిధంగా రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు శ్రీ నారా చంద్రబాబునాయుడు గారు గతం లో అరకు వేదిక గా ఏజెన్సీ ప్రాంతంలోని అన్ని ఉద్యోగాలు స్థానిక ఆదివాసీలకే 100 కు 100 % ఇస్తానని ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవాలని ఈ ఆగస్టు 9 అంతర్జాతీయ ఆదివాసి దినోత్సవం సందర్భంగా ఆదివాసీలకు కానుకగా ఏజెన్సీ ప్రాంత ఉద్యోగ నియామక చట్టాన్ని ప్రకటించి ఆదివాసీలకు న్యాయం చేయాలని ఆయన పేర్కొన్నారు అదేవిధంగా మెగా డీఎస్సీ సంబంధం లేకుండా ఆదివాసీలకు ప్రత్యేక ఏజెన్సీ డీఎస్సీ నిర్వహించాలని ఆయన తెలియజేసారు అదేవిధంగా రేపు మారేడుమిల్లిలోఆదివాసీ జేఏసీ తలపెట్టిన ఆదివాసి దినోత్సవం మహాసభను ఆదివాసి ప్రజానీకం వేలాదిగా తరలివచ్చి విజయవంతం చేయాలని ఆయన అందరు స్వచ్ఛందంగా తరలి రావాలి అని పిలుపునిచ్చారు, ఏజెన్సీలో 1070 అలాగే పిసా చట్టాలను ప్రభుత్వ అధికారులు పటిష్టంగా అమలు చేయాలని ఆయన తెలియజేశారు ఈ కార్యక్రమంలో బొడ్డు.బలరాం,బొక్కిలి ప్రసాద్,సోయం కన్నయ్య,కారం వెంకటేష్,ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు
