
శాసనమండలిలో మహబూబ్ నగర్ ఎమ్మెల్సీ నవీన్ కుమార్ రెడ్డి
( పయనించే సూర్యుడు మార్చి 16 షాద్నగర్ నియోజకవర్గం ఇన్చార్జ్ మెగావత్ నరేందర్ నాయక్ )
గత మూడు నెలలుగా కమిషన్ల నిధులు రాక రాష్ట్రవ్యాప్తంగా రేషన్ డీలర్లు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఎమ్మెల్సీ నవీన్ కుమార్ రెడ్డి శనివారం శాసనమండలిలో రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. రూ. 70 కోట్లకు పైగా నిధులు బకాయిలు ఉన్నాయని, ఇటీవలనే చేగుంటలో రేషన్ డీలర్ ప్రభాకర్ ఆత్మహత్యకు పాల్పడ్డాడని, నిధులను తక్షణమే విడుదల చేయాలని ప్రభుత్వాన్ని కోరారు.కాంగ్రెస్ రేషన్ డీలర్లకు 5000 వేతనం, 300 కమిషన్ ఇస్తామని ఎన్నికల సమయం చెప్పిన విషయాన్ని గుర్తు చేశారు. గురుకుల పాఠశాలలో విద్యార్థుల అవస్థలు కొనసాగుతూనే ఉన్నాయని, విద్యార్థులు అనారోగ్యాల బారినపడి చెందుతున్నారని, ఫుడ్ పాయిజన్ అయ్యి విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని సభ దృష్టికి తీసుకెళ్లారు. ప్రభుత్వం గురుకుల పాఠశాలల పురోగతిపై దృష్టి సారించాలని సూచించారు. గురుకుల పాఠశాలలో ముఖ్యంగా పేద విద్యార్థులు చదువుతారనే విషయాన్ని గ్రహించి, వాళ్లకు పౌష్టికాహారాన్ని ఇచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని సూచించారు.