
సన్న బియ్యం పంపిణీ చేస్తున్న దృశ్యం..
రుద్రూర్, ఏప్రిల్ 1(బతుకమ్మ న్యూస్) : అన్నీ రేషన్ షాపులలో ఏప్రిల్ 1 వ తేదీ నుండి కేంద్ర ప్రభుత్వం సన్న బియ్యాన్ని పంపిణీ చేసింది. రుద్రూర్ మండల కేంద్రంలోని రేషన్ షాపులలో మంగళవారం బిజెపి నాయకులు సన్న బియ్యం పంపిణీని ప్రారంభించారు. రాష్ట్రంలోని అన్నీ రేషన్ షాపులలో కేంద్ర ప్రభుత్వం 5 కిలోలు, రాష్ట్ర ప్రభుత్వం 1 కిలో మొత్తం 6 కిలోల సన్న బియాన్ని పంపిణీ చేస్తున్నారు. సన్న బియ్యం పంపిణీ చేయడంతో రేషన్ దారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో ప్రశాంత్ గౌడ్, కటికే రామ్ రాజ్, ఏముల గజేందర్, అనీల్ తదితరులు పాల్గొన్నారు.