
పయనించే సూర్యుడు ఏప్రిల్ 5 టేకులపల్లి ప్రతినిధి (పొనకంటి ఉపేందర్ రావు )
టేకులపల్లి మండల కేంద్రంలో బిజెపి మండలం అధ్యక్షులు శంభూ నాయక్ ఆధ్వర్యంలో బేతంపూడి గ్రామ పంచాయతీలోని బిజెపి కార్యకర్తలతో కలిసి రేషన్ షాప్ ని సందర్శించి సన్న బియ్యం పంపిణీ కార్యక్రమంలో కేంద్ర ప్రభుత్వం యొక్క వాటా శాతాన్ని రేషన్ లబ్ధిదారులకు వివరించటం జరిగింది.ప్రతి రేషన్ షాపు నందు నరేంద్ర మోడీ ఫోటో ని ప్రదర్శించాలని రేషన్ డీలర్లను డిమాండ్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి బాధవత్ సురేష్ యక్ ,పూన్య నాయక్ నాయక్, హతీరం నాయక్, గిరిజన మోర్చా అధ్యక్షులు బానోత్ లక్పతి నాయక్,బిజెపి నాయకులు భూక్య రాందాస్ నాయక్,బోడ గంగ, సినియర్ నాయకులు చిక్కా వెంకటేశ్వర్లు, రేషన్ డీలర్ సంతులాల్, రేషన్ లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు.