నష్టపోయిన అన్ని రకాల పంటలకు ఎకరాకు 20000 నష్టపరిహారం ప్రభుత్వం చెల్లించాలి
తడిసిన దాన్యాన్ని షరతులు లేకుండా కొనుగోలు చేయాలి
ఉమ్మడి పాలమూరు ఎమ్మెల్సీ నాగరకుంట నవీన్ రెడ్డి
( పయనించే సూర్యుడు అక్టోబర్ 30 షాద్ నగర్ నియోజకవర్గం ఇన్చార్జ్ నరేందర్ నాయక్ )
మొంతా తుపాన్ వల్ల ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో మొక్కజొన్న,వరి,పత్తి మరియు ఇతర రకాల పంటలు అకాల వర్షాల వల్ల దెబ్బతిని రైతులకు తీవ్ర పంట నష్టం జరిగిందని దీనిపై ప్రభుత్వం వెంటనే స్పందించి రైతన్నలను ఆదుకునే విదంగా నష్టపోయిన పంటలకు ఎకరాకు 20000 చెల్లించాలని, అదేవిదంగా తడిసిన దాన్యాన్ని ఎటువంటి షరతులు లేకుండా కొనుగోలు చేసి నష్టపోయిన అన్నదాతలకు న్యాయం చేయాలని దీనిపై ప్రభుత్వం వెంటనే ప్రణాళికలు రూపొందించి రైతులకు న్యాయం చేయాలని ఎమ్మెల్సీ నవీన్ రెడ్డి ప్రభుత్వానికి సూచించారు.

