
పయనించే సూర్యుడు నిజామాబాద్ జిల్లా బ్యూరో టికే గంగాధర్ తెలంగాణ నిజాంబాద్ జిల్లా
రైతు జేఏసీ ఆధ్వర్యంలో*సీడ్ కార్పొరేషన్ చైర్మన్ అన్వేష్ రెడ్డి చేతుల మీదుగా పాట విడుదల…
ఎర్ర జొన్నలు పసుపు బోర్డు పోరాటంలో పాల్గొన్న రైతులందరికీ కేసులు ఎత్తివేయాలి. బి ఆర్ ఎస్ ఎర్రజొన్న కొనుగోలు చేస్తారని హామీ ఇచ్చి మోసం చేసిందని, ఎర్ర జొన్నలు కొనిపించే బాధ్యత రైతాంగ పోరాట నాయకుడిగా అన్వేష్ రెడ్డి పై ఉందనివి ప్రభాకర్….. ఈ కార్యక్రమానికి జేఏసీ. కన్వీనర్ లింగారెడ్డి అధ్యక్షత వహించారు. ఈర్గల సుమన్ రచించి గానం చేసిన రైతాంగ పోరాటగలం పాటను రైతు ఐక్యకారచరణ కమిటీ ఆధ్వర్యంలో విడుదల చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి తెలంగాణ సీడ్స్ కార్పొరేషన్ చైర్మన్ అన్వేష్ రెడ్డి. జేఏసీ కన్వీనర్ వి, ప్రభాకర్ నిజామాబాద్ ,ఆర్మూర్, జగిత్యాల రైతు నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీడ్స్ కార్పొరేషన్ చైర్మన్ అన్వేష్ రెడ్డి జేఏసీ నాయకులు వి ప్రభాకర్ మాట్లాడుతూ. ఎన్నో ఏళ్లుగా రైతులు పోరాటాలు చేసి పోలీసు దెబ్బలను ఓర్చుకొని అక్రమ కేసులను, జైలు జీవితం ఎదిరించి ఎర్రజొన్నల మద్దతు ధరకు, పసుపు బోర్డు సాధనకై పోరాటం చేశారు ..దశాబ్దాలుగా ఈ ఉద్యమాన్ని తెలంగాణలోనే కాకుండా దేశవ్యాప్తంగా ఆర్మూర్ వైపు చూసేలా ఉద్యమాన్ని ఉధృతం చేస్తారు కష్టాలను, నష్టాలను భరించి ఏకతాటిపై వచ్చి అన్ని పార్టీలు తమ ఎజెండాలను, జెండాలను పక్కకు పెట్టి ఉద్యమంలో నడిచారు .అన్ని కష్టాలను అన్ని బాధలను దిగమింగుకొని పోరాటాలను కొనసాగించారు .ఆ పోరాటాలను గుర్తుచేస్తూ కామ్రేడ్ సుమన్ తన మదిలోని భావాలను ఆర్మూర్ రైతన్న పోరాటాల గుర్తులను తన రచన రూపంలో పాటగా మలిచి పాడి ఈరోజు మన ముందుకు ఆవిష్కరణకు తీసుకొచ్చారు ఇలాంటి వారిని ప్రోత్సహిస్తూ రైతంగ ఉద్యమాలను ఆనాటి జ్ఞాపకాలను నెమరవెసుకోవాలని వారు తెలియజేశారు. వ్యవసాయ రంగాన్ని కార్పొరేట్ శక్తులకు గొప్ప చెప్పే కేంద్ర ప్రభుత్వ కుక్కలను ఎదిరించాలని పిలుపునిచ్చారు. అదేవిధంగా వి.ప్రభాకర్ మాట్లాడుతూ రైతన్నల పైన పెట్టినటువంటి కేసులను ఎత్తివేసే విధంగా అన్వేష్ రెడ్డి చర్యలు తీసుకోవాలని నొక్కి చెప్పారు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడానికి ముందు రైతుల మీద ఉన్న కేసులను ఎత్తివేస్తామని చెప్పారని ఆ మాటను వారు గుర్తు చేస్తూ అన్వేష్ రెడ్డి చూపించాలని వారు తెలిపారు. ఈ పాటలు ప్రధాన పాత్ర పోషించిన వారు మంథని నవీన్ రెడ్డి. డైరెక్టర్ చేసిన వారు చిట్టిబాబు డిఓపి చేసినవారు సంజీవ్ నటించిన వారు సూరిబాబు అనిల్ కుమార్ నిఖిల్ నరేందర్ మరియు మంథని గ్రామ ప్రజలు ఈ కార్యక్రమంలో రైతు జేఏసీ నాయకులు. మంథని గంగారం. బి దేవారం.బి. కిషన్. ఆకుల గంగారం. రాజన్న.జగిత్యాల రైతు ఐక్యవేదిక నాయకులు తిరుపతి రెడ్డి , నారాయణ రెడ్డి , శ్రీనివాస్ రెడ్డి, నరేందర్ భారత్, దుర్గాప్రసాద్ రాజా రెడ్డి, రైతులు తదితరులు పాల్గొన్నారు..
