
సిపిఐ (ఎంఎల్) మాస్ లైన్ రాష్ట్ర నాయకులు నాయిని రాజు
పయనించే సూర్యుడు అక్టోబర్ 17 (పొనకంటి ఉపేందర్ రావు )
ఇల్లందు: మాస్ లైన్ అఖిలభారత ఐక్య రైతు సంఘ(AIUKS)మండల కమిటీల ఆధ్వర్యంలో శుక్రవారం ప్రతినిధి బృందం ఇల్లందు వ్యవసాయ అధికారి ఏవో కు ఇల్లందుమండలంలోపోలారం .కొమరారం .మాణిక్యరం. రొంపేడు .చల్ల సముద్రం సుదిమల్ల 6.సెంటర్లలో మొక్కజొన్న గోనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని మధ్య దళారుల దోపిడీని అరికట్టాలని ప్రభుత్వం ప్రకటించిన 2400 రూపాయలతో పాటు బోనస్ లను కూడా చెల్లించాలని సమస్యలతో కూడిన మెమోరాండాన్ని ఏవోకి సమర్పించడం జరిగింది .వ్యవసాయ అధికారి(AO) స్పందిస్తూ ఈ మండలంలో మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు మీరు పేర్కొన్న విధంగా ఏర్పాటు చేయుటకు మేము ప్రతిపాదనలు పంపించామని పండగ తర్వాత కొనుగోలు కేంద్రాలను ప్రారంభిస్తామని అప్పటివరకు మొక్కజొన్న రైతులు మధ్య దళారులకు మోసపోకుండా ప్రభుత్వ కేంద్రాలలో అమ్మకాలు జరిగే విధంగా చూడండి అని వారు హామీ ఇవ్వడం జరిగింది కావున ఇల్లందు మండలంలో ఉన్న మొక్కజొన్న రైతులకు సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ అఖిలభారత ఐక్య రైతుసంఘం (AIUKS)విజ్ఞప్తి చేస్తా ఉంది ప్రభుత్వ ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలలోనే మొక్కజొన్నలువిక్రయించుకోవాలని మధ్య దళారుల ఒత్తిడికి గురికాకుండా మోసపోకుండా ఉండాలని విజ్ఞప్తి చేస్తున్నాం ఇందులో భాగంగా వ్యాపారస్తులు రైతులపై ఒత్తిడితో కొనుగోలు చేస్తే ప్రభుత్వం ప్రకటించిన 2400 కంటే తక్కువ చేస్తే ఆ రేటును కట్టిస్తామని హెచ్చరిస్తున్నాం ఈ కార్యక్రమంలో సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ జిల్లా నాయకులు ఆర్ బోస్. డివిజన్ కమిటీ నాయకులు ఆవుల కిరణ్.కొమరారం ప్రాంతీయ కమిటీ కార్యదర్శి బుర్ర రాఘవులు. అఖిలభారత ఐక్య రైతు సంఘం(AIUKS) మండల అధ్యక్షులు జూకంటి గాంధీ అఖిలభారత ఐక్య రైతు సంఘం మండల నాయకులు మోడంరాంబాబు అజ్మీర బిచ్చ తదితరులు పాల్గొన్నారు
ఎండ్ న్యూస్