Saturday, April 26, 2025
Homeతెలంగాణరైతులకు అన్ని సౌకర్యాలు కల్పించండి

రైతులకు అన్ని సౌకర్యాలు కల్పించండి

Listen to this article

▪️కలెక్టర్ పమేలా సత్పతి..

పయనించే సూర్యడు // ఏప్రిల్ // 25 // జమ్మికుంట // కుమార్ యాదవ్.. ధాన్యం కొనుగోలు కేంద్రంలో రైతులకు ఇబ్బందులు రాకుండా అన్ని సౌకర్యాలు కల్పించాలని కలెక్టర్ పమేలా సత్పతి అధికారులను ఆదేశించారు. శుక్రవారం ఇల్లందకుంట లో డీసీఎంఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా సిబ్బందిని అడిగి కేంద్రానికి వచ్చిన ధాన్యం, సన్న రకాలు, కల్పిస్తున్న సౌకర్యాలు తెలుసుకున్నారు. అనంతరం ధాన్యంలో తేమశాతం స్వయంగా పరిశీలించారు. నిర్వాహకులకు పలు సూచనలు చేశారు. తహసీల్దార్ రాణి, కేంద్ర ఇన్చార్జి అశోక్ తదితరులు ఉన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments