
చింతూరు మండలం లో రైతు సంక్షేమం కోసం పనిచేసే పార్టీ టీడీపీ అనికూటమి ప్రభుత్వం అన్నారు , టీడీపీ చింతూరు మండల అధ్యక్షులు ఇల్ల చిన్నారెడ్డి మాట్లాడుతూ మన జెండాలోనే నాగలి గుర్తు ఉందని , అన్నదాత బాగుంటేనే రాష్ట్రం సుభిక్షంగా ఉంటుందని టిడిపి ,కూటమి ప్రభుత్వం ద్వారా అన్నదాత సుఖీభవ – పిఎం కిసాన్ పథకం ద్వారా రైతుల ఖాతాల్లోకి నిధులు విడుదలైన సందర్భంగా హర్షం వ్యక్తం చేస్తూ రంపచోడవరం ఎమ్మెల్యే మిరియాల శిరీషదేవి భాస్కర్ సూచన మేరకు చింతూరు మండలం, గ్రామంలో మంగళవారం రైతులు భారీగా ట్రాక్టర్లతోభారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా కూటమి నాయకులు మాట్లాడుతూ సూపర్ సిక్స్ పథకాలలో భాగమైన అత్యంత కీలకమైన అన్నదాత సుఖీభవ , పీఎం కిసాన్ పథకం ద్వారా ప్రతి రైతు కళ్లలో ఆనందం నింపడమే లక్ష్యంగా కేంద్ర , రాష్ట్ర ప్రభుత్వాలు పని చేస్తున్నాయన్నారు. ఎన్ని కష్టాలున్నా ప్రజా శ్రేయస్సు కోసం ప్రభుత్వం సంక్షేమం అమలు చేస్తున్నట్టు పేర్కొన్నారు. మన ప్రభుత్వం చేస్తున్న మంచి పనులను జనంలోకి తీసుకెళ్లి అర్ధమయ్యేలా వివరించాల్సింది పార్టీ యంత్రాంగమే అని వారు తెలిపారు. నిత్యం పార్టీ క్యాడర్ ప్రజలలో , ప్రజలతో కలిసి ఉండాలని , వారి కోసమే పనిచేయాలని , మరింత మంది మన కూటమి పాలనను మెచ్చాలన్నారు. రానున్న రోజుల్లో మరిన్ని సంక్షేమ పథకాలు చంద్రన్న సారథ్యంలో అమలవుతాయని వారు ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో టిడిపి, సీనియర్ నాయకులు ఓబిలినేని రామారావుచౌదరి బీజేపీ మండల అధ్యక్షులు బట్ట.లక్ష్మణరావు,బట్ట సుప్రజా,రామారావు,టీడీపీ మల్లెల వెంకటశ్వరావు అసిఫ్,నర్సింహారావు,సురేష్ చౌదరి, జనసేన పయ్యావుల నాగేశ్వరావు పాల్గొన్నారు.
