
పయనించే సూర్యుడు ఆగస్టు 19 శర్మాస్ వలి మండల రిపోర్టర్ యాడికి
మండలంలోని యాడికి రైతు సేవా కేంద్రంలో పొలం పిలుస్తోంది కార్యక్రమం నిర్వహించడం జరిగినది. ఈ కార్యక్రమానికి శ్రీ వెంకటరాముడు సహాయ వ్యవసాయ సంచాలకులు గుత్తి వారు, రైతు శిక్షణ కేంద్రం అనంతపురం నుండి వ్యవసాయ అధికారి నరసింహులు గారు ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి వెంకట రాముడు గారు మాట్లాడుతూ రైతులు పత్తి పంటలో గులాబీ రంగు పురుగు నుండి అలాగే వేరుశనగ పంటలో మెలకువలు పాటిస్తే అధిక దిగుబడులు పొందే అవకాశం ఉందన్నారు. నేల ఆరోగ్య పత్రం ఆధారంగా ఎరువులు వినియోగించుకుంటే రైతుకు పెట్టుబడులు మరియు పర్యావరణాన్ని రక్షించిన వారు అవుతారన్నారు. రైతులు ప్రస్తుతం సాగు చేస్తున్న పంటల్లో కొత్త వంగడాలు ఏవైనా వేయదలుచుకుంటే వ్యవసాయ అధికారి గారికి తెలియజేస్తే కృషి విజ్ఞాన కేంద్రం ద్వారా తెప్పించి ఇవ్వడం జరుగుతుందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో రైతులకు పంటలపై అవగాహన కల్పించే పుస్తకాలను పంపిణీ చేయడం జరిగినది. ఈ కార్యక్రమానికి మండల వ్యవసాయ అధికారి మహబూబ్ బాషా,వ్యవసాయ విస్తరణ అధికారి రజిత, గ్రామ వ్యవసాయ అధికారి రాంబాబు గ్రామ రైతులు పాల్గొన్నారు.
