
పయనించే సూర్యుడు మార్చి 25 టేకులపల్లి ప్రతినిధి పొనకంటి ఉపేందర్ రావు :టేకులపల్లి అసంపూర్తిగా ఉన్న రోడ్డు పనులు త్వరగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ వాహనాన్ని దాసు తండా గ్రామస్తులు అడ్డుకున్నారు. టేకులపల్లి మండల పరిధిలోని బోడు గ్రామంలో వివిధ పనులను పరిశీలించేందుకు టేకులపల్లి మండల కేంద్రం మీదుగా బోడు గ్రామానికి వెళ్తున్న కలెక్టర్ వాహనాన్ని దాస్ తండా గ్రామస్తులు రోడ్డుపై నిలబడి అడ్డుకున్నారు. రెండు సంవత్సరాల క్రితం ప్రారంభించిన రోడ్డు పనులు మధ్యలోనే అసంపూర్తిగా వదిలేసారని, దుమ్ము ధూళి దొర గ్రామంలో అనేకమందికి శ్వాసకోసా సంబంధించిన వ్యాధుల బారినపడి హాస్పిటల్ కి వెళ్తున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. తమరు ప్రత్యేక చొరవ తీసుకొని పనులు ప్రారంభించాలని గ్రామస్తులు కలెక్టర్ ను వేడుకున్నారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు మరియు అధికారులు పాల్గొన్నారు.