రుద్రూర్, అక్టోబర్ 28 (పయనించే సూర్యుడు, రుద్రూర్ మండల ప్రతినిధి):
రుద్రూర్ గ్రామం నుండి చెరువు కట్ట మీదుగా బొప్పాపూర్ గ్రామానికి వెళ్లే రహదారి పై బురద మట్టితో రోడ్డు మొత్తం పేరుకుపోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ రోడ్డు గుండా ప్రయాణించాలంటే ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకుని ప్రయాణించాల్సి వస్తుందని వాహనదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సోమవారం రాత్రి కురిసిన వర్షానికి రోడ్డు పై బురద మట్టితో పాటు వర్షపు నీరు ఉండడంతో ద్విచక్ర వాహనదారులు స్కిడ్ అయ్యి కింద పడిపోతున్నామని ద్విచక్ర వాహనదారులు ఆరోపిస్తున్నారు.

