
పయనించే సూర్యుడు// న్యూస్ మే 28//మక్తల్
నారాయణపేట జిల్లా మక్తల్ మండలం జక్లేర్ ప్రధాన రహదారి 167 పై జరిగిన రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి చెందాడు. నర్వ మండలం రాజుపల్లి గ్రామానికి చెందిన కొండారెడ్డి సరుకుల నిమిత్తం జక్లేర్ ప్రధాన రహదారిపై రోడ్డు దాటుతుండగా అతివేగంగా వచ్చిన లారీ ఢీకొంది. దీంతో కొండారెడ్డి అక్కడికక్కడే మృతి చెందాడు ఈ విషయమై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు మక్తల్ ఎస్ఐ భాగ్యలక్ష్మి రెడ్డి తెలిపారు.