
పయనించే సూర్యుడు గాంధారి 27/04/25 రోడ్డు ప్రమాదాల నివారణకు యాక్సిడెంట్ రిజొల్యూషన్ టీం ఆధ్వర్యంలో తనిఖీ. గత కొన్ని రోజుల నుండి జరుగుతున్న ప్రమాదాలు ఎలా జరుగుతున్నాయి ఏదైనా రోడ్డు భద్రత సంబంధించిన చర్యలు, జాగ్రత్తల గురించి ART ఆక్సిడెంట్ రిసొల్యూషన్ టీం ఆధ్వర్యంలో తనిఖీ చేసి కొన్ని సలహాలు సూచనలు ఇవ్వనైనది. టీం నందు సదాశివ నగర్ సిఐ సంతోష్ కుమార్ అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ బిక్షపతి ఆర్ అండ్ బి ఏ ఈ రవితేజ, గాంధారి ఎస్సై ఆంజనేయులు మరియు ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ విషయమై ముఖ్యంగా గాంధారి పట్టణంలో ఖచ్చితంగా స్పీడ్ బ్రేకర్లు మరియు ramble స్ట్రిప్స్ వేయవలెనని టీం సూచనలు చేసినది