పయనించే సూర్యుడు, జనవరి 30, ఆదోని రూలర్ రిపోర్టర్
ఈరోజు ఆదోని పట్టణం లో “రోడ్ సేఫ్టీ కమిటీ డివిజనల్ లెవెల్ మీటింగ్” నిర్వహించటమైనది. దీనికి “చైర్మన్ మరియు సబ్ కలెక్టర్ అయిన ఎం మౌర్య భరద్వాజ్ ఐఏఎస్” అధ్యక్షతన జరగగా ఈ మీటింగ్ నందు పోలీసు డిపార్టుమెంటు తరపున ఆదోని డీఎస్పీ మర్రిపాటి హేమలత , ఎమ్మిగనూరు డిఎస్పి ఉపేంద్ర బాబు , కోసిగి సర్కిల్ సర్ ఇన్స్పెక్టర్ ఆదోని ట్రాఫిక్ సిఐ పాల్గొన్నారు.
ఇతర శాఖల అధికారులు అనగా ఆర్ అండ్ బిడిపార్ట్మెంట్, మున్సిపల్ కమిషన్, పంచాయతీరాజ్, మెడికల్,నేషనల్ హైవే ఇంకా ఇతర అధికారులు పాల్గొనడం జరిగినది. ఆదోని డివిజన్ నందు రోడ్డు ప్రమాదాలను నివారించుటకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, చేపట్టవలసిన పనులు, పాటించవలసిన నియమాలు గురించి చైర్మన్ గారు అధికారులకు తగు సూచనలు ఇవ్వడం అయినది.
సీఐ,ఆదోని ట్రాఫిక్ పిఎస్