
పయనించే సూర్యుడు, మే 23 పెద్ద శంకరంపేట మండలం.. మెదక్ జిల్లా..( రిపోర్టర్ జిన్న అశోక్)లంచం తీసుకుంటూ ఒక అవి నీతి అధికారి ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డాడు. అభివృద్ధి పనుల్లో భాగంగా చేపట్టిన కాంట్రాక్ట్ పనికి సంబంధించిన చెక్కును ఇచ్చేందుకు లంచం తీసుకుంటూ పెద్దశంక కరంపేట ఎంపీఈవో ( ఇంచార్జ్ ఎంపీడీవో) శుక్రవారం ఏసీబీ కి చిక్కారు.కాంట్రాక్ట్ పనికి చెందిన డబ్బులను డిమాండ్ చేయడంతో జరిగిన ఏ సీబీ దాడి మండలంలో చర్చనీయాంశమైంది. ఇందుకు సంబంధించి మెదక్ రేంజ్ ఏ సీబీ డిఎస్పీ సుదర్శన్ తెల్పిన ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. పెద్ద శంకరంపేట్ మండల కేంద్రం లో కాంట్రాక్టర్ డ్రెయినేజీ పనిని చేపట్టాడు. చేపట్టిన పని విలువ మొత్తం రూ.2.92 లక్షలు కాగా మేజర్ మెంట్ జరిగిన రూ.1.95.747 లక్షల చెక్ కాంట్రాక్టర్ కు రావాల్సి ఉంది. ఈమొత్తానికి సంబంధించిన చెక్ ను సదరు కాంట్రాక్టర్ కు ఎంపీఈవో ఇవ్వాల్సి ఉంది. అట్టి చెక్ ను ఇష్యు చేయడానికి స్థానిక ఇన్చార్జ్ ఎంపీడీవో విఠల్ రెడ్డి కాంట్రాక్టర్ ను ఈ నెల 20 వ తేదీన మొదట రూ. 20 వేలను డిమాండ్ చేశాడని తెలిపారు. ఆ తర్వాత రెండవ సారి రూ.15 వేలను ఇవ్వాలని డిమాండ్ చేశాడని చెప్పారు. లంచం కోసం తనను వేధించడాన్ని భరించలేక బాధిత కాంట్రాక్టర్ ఈ నెల 20 వ తేదీన ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. దీంతో వల పన్నిన మెదక్ రెంజ్ ఏసీబీ అధికారులు పథకం ప్రకారం శుక్రవారం నాడు మండల పరిషత్ కార్యాలయంలో రూ.15 వేలును లంచంగా తీసుకుంటున్న ఎంపీఈవో విఠల్ రెడ్డిని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నామన్నారు. పట్టుకున్న డబ్బును కోర్టులో జమ చేస్తామని తెలిపారు. లంచం అడిగిన వారిని పట్టించేందుకు అవినీతి నిరోధానికి గాను 1064 టోల్ ఫ్రీ కి కాల్ చేయవచ్చని డిఎస్పీ చెప్పారు. ఈ దాడుల్లో ఇన్స్పెక్టర్లు వెంకటేశ్వర్లు, రమేష్, టీమ్ పాల్గొన్నారు.