
( పయనించే సూర్యుడు మార్చి 5 షాద్నగర్ నియోజకవర్గం ఇంచార్జ్ మెగావత్ నరేందర్ నాయక్ ) సోమాజిగూడ ప్రెస్ క్లబ్, హైదరాబాద్ మధ్యాహ్నం 2-00 గంటలకు రాష్ట్ర కార్యవర్గ సమావేశం నిర్వహిస్తున్నాము. కావున రాష్ట్ర కార్యవర్గ సభ్యులు జాతీయ కార్యవర్గ సభ్యులు జిల్లా అధ్యక్షులు,జిల్లా ఇంచార్జ్ లు పాల్గొని పలు అంశాల పైన చర్చలు జరిపే తీర్మానాలు. 1), శాసన సభ్యుల (ఎమ్మెల్యే) కోటలో శాసనమండలి సభ్యులుగా కాంగ్రెస్ పార్టీ నాయకులు డా: తేజావత్ బేల్లయ్య నాయక్ కి అవకాశం ఇవ్వాలని 2) లంబాడీల భాష గోర్ బోలిని భారత రాజ్యాంగంలోని 8వ షెడ్యూల్ లో చేర్చాలని 3) భారతదేశంలో ఉన్న 15 కోట్ల మంది బంజారాలను ఓకే కేటగిరీలో చేర్చాలని 4) బంజారాల పెళ్ళిళ్లను సాంప్రదాయబద్ధంగా జరిపించాలని ఫ్రీ వెడ్డింగ్ షూట్ లు,హల్దీ ఫంక్షన్లు, డీజే లపై నిషేధం విధిస్తూ జరుగుతున్న పోరాటంలో లంబాడి హక్కుల పోరాట సమితి కీలక పాత్ర పోషించాలని డిమాండ్ చేస్తూ పై అంశాలపై చర్చించలసిన అవసరం ఎంతైనా ఉన్నది. అందుకోసమే ప్రతి ఒక్క నాయకుడు ఈ కార్యక్రమం పాల్గొని భవిష్యత్తు కార్యాచరణ జిల్లాల పర్యటనలు తేదీలను కూడా ప్రకటిస్తాము. కావున ఎల్ హెచ్ పి ఎస్ ముఖ్య నాయకులు హాజరు కావలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను. సామాజిక ఉద్యమాభినందనాలతో
మూడవాత్ రాంబల్ నాయక్.