
పయనించే సూర్యుడు: మే 03: ములుగు జిల్లా వాజేడు మండల ప్రతినిధి,రామ్మూర్తి.ఎ.
వాజేడు: ములుగు జిల్లా వాజేడు మండలం, పేరూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలోని కడేకల్ గ్రామంలో (NCVBDC) జాతీయ కీటక జనీత వ్యాధుల నియంత్రణలో భాగంగా పేరూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యులు డాక్టర్ రాహిల్ సూచనలమేరకుసాధారణంగా మలేరియా అంటే చలి వణుకుతో జ్వరం
విపరీతమైన ఉష్ణోగ్రతతో జ్వరంవచ్చి, చెమటలు పట్టడం తలనొప్పి మొదలగు లక్షణాలు ఉంటాయి.కానీ చత్తీస్గడ్ సరిహద్దు ప్రాంతం కావడం వ్యవసాయ పనుల నిమిత్తం వలస కూలీలు రావడం నిత్యం వైద్యం మరియు ఇతర అవసరాల కోసం చతిస్గడ్ నుంచి ప్రజలు ఈ ప్రాంతాలలో సంచరించుట లేక నివసించుట లేక బస చేయుట జరుగుతుందనీ, దానివలన మలేరియా తీవ్రత పెరుగుతుందనీ, మలేరియా రహిత వాజేడు మండలంగా చేయడంలో భాగంగా దోమలు పుట్టకుండా చేయుట, ప్రజల ఆవాసాలలో దోమల నివాసాలు కాకుండా చూసుకుంటూ, జ్వరమా మలేరియా కావచ్చు, అని వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేసుకొని పూర్తిస్థాయి చికిత్స తీసుకోవాలనీ గ్రామ ప్రజలకి డాక్టర్ రాహిల్ చూసించారు. మలేరియా ప్రభావిత ప్రాంతాలలో ముందస్తు జాగ్రత్తలలో చర్యలలోభాగంగా లక్షణాలు లేని మలేరియా జ్వరం నిర్ధారణ పరీక్షలు నిర్వహించడం జరిగినదని తెలియజేశారు. ఈయొక్క కార్యక్రమంలో హెచ్.ఇ.ఓ.వేణుగోపాలకృష్ణ, హెచ్.ఏ. తిరుపతి,
ఏఎన్ఎం, శ్రీదేవి,శారద, ఏడబ్ల్యుటి,శ్రీదేవి మరియు ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు.
