
పయనించే సూర్యుడు// న్యూస్ 28 //నారాయణపేట జిల్లా బ్యూరో // బి విశ్వనాథ్
నారాయణపేట జిల్లా మక్తల్ నియోజకవర్గ కేంద్రం స్థానిక తహసిల్దార్ కార్యాలయంలో కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ మరియు సీఎం సహాయనిధి చెక్కులను లబ్ధిదారులకు అందజేసిన మక్తల్ నియోజకవర్గం శాసనసభ్యులు “డా “వాకిటి శ్రీహరి చెక్కుల పంపిణీ అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో అప్పుల్లో ఉన్న పేదోడికి సహాయం అందించే కార్యక్రమాల్లో భాగంగా కళ్యాణ, లక్ష్మి షాదీ ముబారక్, సీఎం సహాయనిధి చెక్కుల పంపిణీ కార్యక్రమాన్ని నిర్విరామంగా కొనసాగిస్తున్న ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలిపారు ప్రభుత్వం ఏర్పడిన నాటి నుండి ఇప్పటివరకు మక్తల్ నియోజకవర్గం లోని ఏడు మండలాలకు గాను కల్యాణ లక్ష్మి ,షాదీ ముబారక్ చెక్కులను 2122 మందికి (ఇరవై ఒక్క కోట్ల 22 లక్షల రూపాయలను) ఇవ్వడం జరిగిందని ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి అన్నారు ఇట్టి కార్యక్రమంలో ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి తహసిల్దార్ సతీష్ Ari భూపాల్ రెడ్డి Ri రాములు మరియు కాంగ్రెస్ పార్టీ నాయకులు, మాజీ Mpp చంద్రకాంత్ గౌడ్ మాజీ Zptc లక్ష్మారెడ్డి మార్కెట్ ఉపాధ్యక్షులు గణేష్ పట్టణ అధ్యక్షులు రవికుమార్ కావలి తాయప్ప తదితరులు పాల్గొన్నారు
