
లబ్ధిదారులకు రేషన్ కార్డులను అందజేస్తున్న ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి…
రుద్రూర్, జూలై 22 (పయనించే సూర్యుడు, రుద్రూర్ మండల ప్రతినిధి)
: వర్ని మండల కేంద్రంలోని సిసిడి ఫంక్షన్ హాల్లో ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి చేతుల మీదుగా మంగళవారం ఉమ్మడి వర్ని, కోటగిరి మండలాలకు చెందిన లబ్ధిదారులకు నూతన రేషన్ కార్డులు, కళ్యాణ లక్ష్మి ,సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఆరు లక్షల 12 వేల మందికి కొత్త రేషన్ కార్డులు మంజూరు చేయడం జరిగిందని వివరించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఆగ్రో ఇండస్ట్రీస్ చైర్మన్ కాసుల బాలరాజు, బోధన్ సబ్ కలెక్టర్ వికాస్ మహతో, తహసీల్దార్లు, ప్రజా ప్రతినిధులు, నాయకులు, లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు.