
రక్త దానం నిర్వహిస్తున్న దృశ్యం…
రుద్రూర్, ఏప్రిల్ 09 (పయనించే సూర్యుడు, రుద్రూర్ మండల ప్రతినిధి) :
రుద్రూర్ మండల కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో లయన్స్ క్లబ్ ఆఫ్ రుద్రూర్ ఆధ్వర్యంలో బుధవారం రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రుద్రూర్ ఎస్సై పి.సాయన్న హాజరయ్యారు. ఈ రక్తదాన శిబిరంలో 22 యూనిట్ల రక్తాన్ని సేకరించి గవర్నమెంట్ బ్లడ్ బ్యాంక్ బోధన్ వారికి అందించడం జరిగింది. గవర్నమెంట్ బ్లడ్ బ్యాంకులో రక్తపు నిలువలు పూర్తిగా లేనందున వారి కోరిక మేరకు అత్యవసరంగా ఈ క్యాంప్ ను ఏర్పాటు చేసి రక్తాన్ని సేకరించి వారికి అందజేయడం జరిగిందని లయన్స్ క్లబ్ ఆఫ్ రుద్రూర్ అధ్యక్షులు లయన్ కెవి. మోహన్ అన్నారు. ఇందులో హనుమాన్ దీక్షలో ఉండి రిపోర్టర్ ఉమాకాంత్ కూడా రక్త దానం చేయడం గమనార్హం. ఈ కార్యక్రమంలో ఎంఈవో కట్టా శ్రీనివాస్, కర్నె శంకర్, వెంకటరమణ, క్లబ్ సభ్యులు లయన్స్ శ్యామ్ సుందర్ పహడే, గుండూరు ప్రశాంత్ గౌడ్, ఇమ్రాన్, పుట్టి సాగర్, గాండ్ల మధు, తుక్కి మహేష్, షామీర్, ఇతర సభ్యులు వినయ్, కుమ్మరి గణేష్, బోజుగొండ అనిల్ బ్లడ్ బాంక్ సిబ్బంది టెక్నీషియన్ సజీదా బేగం, కిరణ్, ప్రాణవి, శ్రావణ్ తదితరులు పాల్గొన్నారు.