
1).విద్యార్థులకు ఎనర్జీ డ్రింగ్స్ పంపిణీ చేస్తున్న దృశ్యం..
2).మొక్కలు నాటుతున్న దృశ్యం…
రుద్రూర్, జూలై 23 (పయనించే సూర్యుడు, రుద్రూర్ మండల ప్రతినిధి):
రుద్రూర్ మండల కేంద్రంలోని ప్రభుత్వ ఉర్దూ మీడియం, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో లయన్స్ క్లబ్ ఆఫ్ రుద్రూర్ ఆధ్వర్యంలో బుధవారం పాఠశాల్లోని విద్యార్థిని, విద్యార్థులకు ఎనర్జీ డ్రింగ్స్ పంపిణీ చేశారు. అనంతరం పాఠశాల ఆవరణలో మొక్కలను నాటారు. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ అధ్యక్షులు కేవి.మోహన్, శ్యామ్ సుందర్ పహాడే, లయన్స్ క్లబ్ సభ్యులు రమేష్, కటికే రామ్ రాజ్, షామీర్, పుట్టి సందీప్, గాండ్ల మధు పాఠశాల ఉపాధ్యాయుని, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.
