పయనించే సూర్యుడు అక్టోబర్ 29,నంద్యాల జిల్లా రిపోర్టర్ జి. పెద్దన్న
- బేటీ బచావో – బేటీ పడావో లక్ష్య సాధనకు కృషి.నంద్యాల ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి
లింగ వివక్ష చట్ట రీత్యా నేరమణి, దేశ వ్యాప్తంగా బేటీ బచావో – బేటీ పడావో లక్ష్య సాధన కోసం కృషి జరుగుతుందని నంద్యాల పార్లమెంట్ సభ్యురాలు, లోక్ సభ టీడీపీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ డాక్టర్ బైరెడ్డి శబరి అన్నారు.న్యూ ఢిల్లీలోని డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ ఇంటర్నేషనల్ సెంటర్ లో కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి జేపీనడ్డా అధ్యక్షతన 31వ కేంద్ర పర్యవేక్షణ మండలి సమావేశం జరిగిందని కేంద్ర పర్యవేక్షణ మండలి సభ్యురాలు, ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి అన్నారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ Pre-Conception and Pre-Natal Diagnostic Techniques (Prohibition of Sex Selection) Act, 1994 అమలు, ప్రగతిని సమీక్షించి, లింగ సమానత్వం, మహిళా రక్షణ, గర్భనిర్ధారణకు ముందు, తర్వాత లింగ వివక్ష నిర్మూలన వంటి అంశాలపై చర్చించామన్నారు.
దేశవ్యాప్తంగా “బేటీ బచావో – బేటీ పడావో” లక్ష్యాన్ని సాధించడంలో భాగంగా ఈ సమావేశం ముఖ్యమైన అడుగుగా నిలిచిందన్నారు.

