
పయనించే సూర్యుడు నవంబర్ 5 (ఆత్మకూరు నియోజకవర్గం ప్రతినిధి మన్నేపల్లి తిరుపతయ్య)
చేజర్ల మండలం లోని లుంబిని విద్యాలయం నందు కార్తీక పౌర్ణమి వేడుకలను ఘనంగా బుధవారం నిర్వహించారు. ఈ వేడుకల్లో పదవ తరగతి విద్యార్థినిలు కార్తీక దీపాలు వెలిగించి ఓం నమః శివాయ అంటూ శివనామ స్మరణతో పాఠశాల ఆవరణమంతా మార్మోగింది. తీర్థ ప్రసాదం స్వీకరించడం జరిగింది ఈ కార్యక్రమం లో పాఠశాల ఉపాధ్యాయునీలు కూడా పాల్గొని కార్తీక దీపాలు వెలిగించి శివభక్తితో పరవసించారు. లుంబినియాజమాన్యం హర్షం వ్యక్తం చేశారు. లుంబిని యాజమాన్యం. మాట్లాడుతూ మా పాఠశాలలో చదువుకుంటున్న విద్యార్థి విద్యార్థులు చేపడుతున్న వంటి కార్యక్రమాలు వారి తల్లిదండ్రులకు మండల ప్రజలకు ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి అలాగే ప్రతి విద్యార్థి ఉన్నత చదువులకు వెళ్లడం మాకు ఎంతగానో సంతోష్ వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో లుంబిని యాజమాన్యం ఉపాధ్యాయులు విద్యార్థి విద్యార్థులు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు