Saturday, April 19, 2025
Homeఆంధ్రప్రదేశ్వంట గ్యాస్ ,చమురు ధరలను పెంచి దేశ ప్రజలను వంచించిన ప్రధాని మోడీ

వంట గ్యాస్ ,చమురు ధరలను పెంచి దేశ ప్రజలను వంచించిన ప్రధాని మోడీ

Listen to this article

పయనించే సూర్యుడు ఏప్రిల్ 9 నిజామాబాద్ జిల్లా బ్యూరో టీ కే గంగాధర్-.


తెలంగాణ నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ సంయుక్త మండల కార్యదర్శి పి కిషన్ పిఓడబ్ల్యూ జిల్లా ఉపాధ్యక్షురాలు పి సత్యం తీవ్ర విమర్శించారు

పేదలపై పన్నులు సంపన్నులకు రాయితీలు నరేంద్ర మోడీ నయా వంచన పాలన


సిపిఐ (ఎంఎల్) మాస్ లైన్ ఆర్మూర్. సంయుక్త మండల కార్యదర్శి. జి. కిషన్. పి ఓ డబ్ల్యు జిల్లా ఉపాధ్యక్షురాలు. సత్యవ్వ తీవ్ర విమర్శ


వంట గ్యాస్ ,చమురు ధరలను పెంచి దేశ ప్రజలను ప్రధాని మోడీ వంచించారని, పేదలపై పన్నులు పెంచుతు సంపన్నులకు రాయితీలు ఇస్తు నరేంద్ర మోడీ నయా వంచన పాలనచేస్తున్నాడని సిపిఐ (ఎంఎల్) మాస్ లైన్ ఆర్మూర్ సంయుక్త మండల. కార్యదర్శి . బి. కిషన్. ఓ డబ్ జిల్లా ఉపాధ్యక్షురాలు. వి సత్యవ్వ తీవ్రంగా విమర్శంచారు. బుధవారం నాడు కేంద్రం ప్రభుత్వం పెంచిన చమురు ధరలు,వంట గ్యాస్ ధరలకు నిరసనగా రాష్ట్రవ్యాప్త ఆందోళనలకు సిపిఐ (ఎంఎల్) మాస్ లైన్ రాష్ట్ర కమిటీ పిలుపుమేరకు ఆర్మూర్ మండల కేంద్రంలోనీ అంబేద్కర్ చౌరస్తాలోప్రధాని నరేంద్ర మోడీ దిష్టిబొమ్మ దగ్ధం చేశారు. ఈ సందర్భంగా సిపిఐ (ఎంఎల్) మాస్ లైన్ ఆర్మూర్ సంయుక్త మండల కార్యదర్శి. బి కిషన్. ఓ డబ్ల్యు జిల్లా ఉపాధ్యక్షురాలు. వి సత్యవలు మాట్లాడుతు:
ప్రధాని నరేంద్ర మోడీ 11 ఏళ్లుగా సంపన్నులైనా కార్పొరేట్ల కుమ్ముగాస్తు దేశ ప్రజలు ముఖ్యంగా పేదలపై ధరలు, పన్నులు పెంచి వాళ్ల వెన్ను వీరుస్తున్నారన్నారు. ప్రపంచవ్యాప్తంగా చమురు-కుడాయి రేట్లు తగ్గిన ఇక్కడ పెట్టుబడిదారుల కు వత్తాసు పలుకుతూ పెట్రోల్ వంట గ్యాస్ ధరలు పెంచడం సిగ్గుచేటు అన్నారు. మతం మత్తులో దేశ ప్రజలను ముంచి తుగ్లక్ ను మించిన మతి లేని పరిపాలన చేస్తున్నాడు అన్నారు. ప్రజల మస్థికాన్ని పక్కదోవపట్టిస్తు దేశాన్ని సర్వనాశనం చేస్తున్నారన్నారు. ధరలు, నిరుద్యోగం, ఆకలి, పేదరికం, ద్రవ్యోల్బణం లాంటి సమస్యలను పట్టించుకోకుండా, పరిష్కరించకుండ “మూలిగే నక్కపై తాటికాయ పడ్డట్టు” ఇట్లా ప్రజలను మరింత భారం వేయడం శోచనీయం అన్నారు. కేంద్రం పేదల పొట్టకొట్టడం తప్ప పేదలను ఆదుకున్నది లేదు అన్నారు. కోటిశ్వరులకు మేలు చేసేందుకే చమురు – వంట గ్యాస్ లను పెంచి తమ నైజం చాటుకున్నారు అన్నారు. ఇప్పటికైనా ప్రధాని మోడీ పెంచిన ధరలను తాగించాలని డిమాండ్ చేస్తున్నాం అన్నారు. కార్యక్రమంలో ఆర్మూర్ ఏరియా పిఓడబ్ల్యూ నాయకురాలు.. అధ్యక్షురాలు. జి పద్మ. ఏరియా ప్రధాన కార్యదర్శి. లక్ష్మి. జ్యోతి. జిల్లా కమిటీ సభ్యురాలు. అనురాధ. ఏఐయుకేఎస్. నాయకులు ఇఫ్తారి రమేష్.. పి వై ఎల్ నాయకులు. రవి. నరేష్.రవి. పి డి ఎస్ యు మమత.. తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments