
పయనించే సూర్యుడు మార్చి 21 టేకులపల్లి ప్రతినిధి (పొనకంటి ఉపేందర్ రావు )
టేకులపల్లి మధ్యాహ్న భోజన కార్మికుల జీతాలు, బిల్లులు, గుడ్ల బిల్లులు పెండింగ్ లో ఉన్నాయని. కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తానన్న పదివేల రూపాయలు ఇంతవరకు ఇవ్వలేదని. ప్రతినెల మొదటి వారంలోనే జీతాలు, బిల్లులు చెల్లించాలని, ప్రభుత్వం ఇస్తానన్న పదివేల రూపాయలు ఇవ్వాలని, ఈఎస్ఐ, పిఎఫ్ ప్రమాద బీమా సౌకర్యం కల్పించాలని పెరిగిన ధరలకు అనుగుణంగా మెనూ ఛార్జీలు పెంచాలని, కాటన్ బట్టలు, యూనిఫామ్ ఇవ్వాలని మరియు ఇతర సమస్యల పరిష్కారం కోసం ఈ నెల 24 హైదరాబాద్ కు వెళ్తున్న సందర్భంగా ఈనెల 24న వంట చేయడం లేదని స్థానిక ఎంఈఓ కార్యాలయంలో బి భాస్కర్ రావు కు మధ్యాహ్న భోజన కార్మికులు వినతి పత్రాలను అందించారు. ఈ కార్యక్రమంలో, వ్యవసాయ కమిటీ నాయకులు కరుదుల వీరన్న, ఇ. నాగలక్ష్మి, వి. పద్మ, ఈసం రాణి, మంగి తదితరులు పాల్గొన్నారు.