
సమావేశంలో మాట్లాడుతున్న దృశ్యం..
రుద్రూర్, ఏప్రిల్ 22 (పయనించే సూర్యుడు, రుద్రూర్ మండల ప్రతి నిధి) :
రుద్రూర్ మండల కేంద్రం లోని బీజేపీ పార్టీ కార్యాలయంలో ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకువచ్చిన వక్ఫ్ బోర్డు సవరణ చట్టం పై మంగళవారం బిజెపి పార్టీ నాయకులకు, కార్యకర్తలకు అవగాహన కల్పించారు. ఈ చట్టం పై ప్రతిపక్షాలు అనవసర రాద్దాంతం చేసి ప్రజలను ముఖ్యంగా ముస్లింలను తప్పుదోవ పట్టిస్తున్నారని, ప్రతి గ్రామంలో ముస్లిం సోదరులకు వక్ఫ్ బోర్డు స్వర్ణ చట్టంపై అవగాహన కల్పించాలని బిజెపి కార్యకర్తలకు దిశా నిర్దేశం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో బాన్సువాడ నియోజకవర్గ కన్వీనర్ గోడుగుట్ల శ్రీనివాస్, రుద్రూర్ మండల అధ్యక్షులు ఆలపాటి హరికృష్ణ, జిల్లా కౌన్సిల్ మెంబర్ ప్రశాంత్ గౌడ్, ప్రధాన కార్యదర్శి ఎముల గజేందర్, యువ మోర్చా మండల అధ్యక్షులు గణేష్, సతీష్ పవర్, బేగరి శివప్రసాద్, వినోద్ కుమార్, సాయికుమార్, మండల సీనియర్ నాయకులు కటిక రాజారాం, పార్వతీ మురళి, చిదుర మహిపాల్, ముస్లిం సోదరులు అల్లా వాలి, గులాబ్ ఖాన్, గుజ్జర్, హైమద్, బూత్ అధ్యక్షులు నడిపి రాజేష్, పెద్దోళ్ల శ్రీకాంత్, శ్రీనివాస్, నితిన్, మండల సీనియర్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.