
పయనించే సూర్యడు // ఏప్రిల్ // 25 // హజురాబాద్ // కుమార్ యాదవ్ : జమ్మికుంట పట్టణంలోని హౌసింగ్ బోర్డ్ కాలనీలో నివాసముంటున్న వోల్లాల వెంకన్న కొంతకాలంగా అనారోగ్యముతో బాధపడుతూ ఇంటి వద్దనే ఉంటున్న తరుణంలో మండుటెండలు ఎక్కువ అవడంతో వడదెబ్బకు గురై శుక్రవారం మధ్యాహ్నం మృతి చెందారు. అతనికి భార్య ఒక కుమారుడు ఉన్నారు. కుటుంబ యజమాని అనారోగ్యానికి గురి కావడంతో కుటుంబం అంధకారంలో చేరింది.ఆరోగ్యంగా కోలుకుంటున్న తరుణంలో వడదెబ్బతో మృతి చెందారు. కుటుంబ సభ్యులు బంధువులు శోకసముద్రంలో మునిగిపోయారు.నిరుపేద అయిన డ్రైవర్ వెంకటేశ్వర్లు కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు.