
పయనించే సూర్యుడు న్యూస్ ఏప్రిల్ 7 (శర్మాస్ వలి మండల రిపోర్టర్ యాడికి)
బ్యాంకులలో క్రాప్ లోన్లు తీసుకున్న రైతులు క్రాప్ లోన్లు వడ్డీతోనే పునరుద్ధరణ చేయాలని యాడికి మండల బి.జె.పి. అధ్యక్షులు వద్ది రాజశేఖర్ సోమవారము బ్యాంకు అధికారులను కోరారు .ఖరీఫ్ పంట కాలంలో రైతులు క్రాప్ లోన్లు తీసుకున్నారని అనావృష్టి అతివృష్టితో రైతులు పంటలు తీవ్రంగా నష్టపోయారని తెలిపారు. క్రాప్ లోన్లు పునరుద్ధరణ ప్రారంభం కానున్న తరుణంలో కేవలం వడ్డీ మాత్రమే కట్టించుకొని క్రాప్ లోన్లు పునరుద్ధరణ చేయాలని యాడికి మండల బి.జె.పి. కన్వీనర్ వద్ది రాజశేఖర్ కోరారు.