
పయనించే సూర్యుడు జులై 9 (పొనకంటి ఉపేందర్ రావు)
ఇల్లందు: మండలంలో వన మహోత్సవంలో భాగంగా రొంపేడు పంచాయితీలో మొక్కలు నాటే కార్యక్రమంలో ఇల్లందు శాసనసభ్యులు కోరం కనకయ్య బుధవారం ఇల్లందు డిఎస్పి, ఫారెస్ట్ ఎఫ్డిఓ, ప్రభుత్వ పాఠశాల విద్యార్థులతో కలిసి చేపట్టారు. అనంతరం ఎమ్మెల్యే కోరం మాట్లాడుతూ వన మహోత్సవం కార్యక్రమాన్ని 1950లో కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఈ కార్యక్రమానికి నాంది పలికి నేటికీ 75 ఏళ్లు నిండాయని తెలిపారు. అలాగే రాష్ట్రవ్యాప్తంగా 20 కోట్ల మొక్కలు పెంచడమే కాంగ్రెస్ ప్రభుత్వం లక్ష్యం అని తెలిపారు. ప్రతి ఒక్క విద్యార్థి ఐదు మొక్కలు పెంచాలన్నారు. సకాలంలో వర్షాలు పడడానికి చెట్లు దోహదపడతాయని, స్వచ్ఛమైన గాలిని అందిస్తాయని తెలిపారు, ప్రతి ఒక్కరూ విధిగా ఒక మొక్కను నాటి దాన్ని సంరక్షించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఇల్లందు డిఎస్పి చంద్రబాను ఫారెస్ట్ ఎఫ్డిఓ కరుణాకర్ చారి ఫారెస్ట్ రేంజర్లు చలపతిరావు, నరసింహారావు, అటవీ శాఖ సిబ్బంది, విద్యార్థినిలు, మార్కెట్ కమిటీ చైర్మన్ బానోత్ రాంబాబు, మాజీ వైస్ ఎంపీపీ మండల రాము, మెట్ల కృష్ణ, డి శివకుమార్, పులి సైదులు, తదితరులు పాల్గొన్నారు