
పయనించే సూర్యుడు న్యూస్ .ఏప్రిల్(5/04/2025) తిరుపతి జిల్లా స్టాఫ్ రిపోర్టర్
భారత మాజీ ఉప ప్రధాని జగ్జీవన్ రామ్ జయంతి సందర్బంగా వరదయ్య పాలెం తహసీల్దార్ కార్యాలయం లో శనివారం ఘన నివాళి అర్పించారు
వరదయ్యపాలెం మండల తహసిల్దార్ కార్యాలయంలో తహసీల్దార్ రాజశేఖర్ ఆధ్వర్యంలో భారత మాజీ ఉప ప్రధాని జగ్జీవన్ రామ్ జయంతి సందర్బంగా అయన చిత్ర పటానికి పూల మాల వేసి ఘనంగా నివాళి అర్పించారు. ఈ కార్యక్రమంలో వీఆర్వో లు మధుస్వామి, రవి రెడ్డి, వెంకటయ్య, రమణయ్య, మోహన్, సిబ్బంది, వీఆర్ఏ లు పాల్గొన్నారు