
ప్రచురణార్థం చింతూరు, ఆగస్టు 30:
గత ఐదు రోజులుగా వరదలు రావడంతో రహదారులు బంద్ అయ్యి రాకపోకలు లేని గ్రామాలకు తక్షణమే నిత్యవసరాలు అందించాలని, దోమలు బెడదతో జ్వరాలు ఎక్కువవుతున్న సందర్భంగా ప్రతి కుటుంబానికి దోమతెరలు పంపిణీ చేయాలని, ఏజీ కోడేరు కేంద్రంలో బోటు ఏర్పాటు చేయాలని సిపిఎం పార్టీ మండల కమిటీ ఆధ్వర్యంలో సబ్ కలెక్టర్ కి వినతిపత్రం ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా సిపిఎం పార్టీ మండల కార్యదర్శి పల్లపు వెంకట్ మాట్లాడుతూ వరదల వలన ఏజీ కోడేరు, ముకునూరు, కల్లేరు, పీఎస్ పల్లి, రామన్నపాలెం గ్రామపంచాయతీల గ్రామాలకు రాకపోకలు బంద్ అయ్యాయని, బుధవారం రోజున నిత్యవసరాలు కొనుక్కునే అవకాశం లేకుండా వరదలు వచ్చాయని దానితో 15 గ్రామాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. గోదావరికి వరద పెరుగుతుండడంతో రహదారులు ఇప్పట్లో వరద నుండి బయట పడే అవకాశం లేనందున ఈ 15 గ్రామాలకు కనీస అవసరాలు అయినా నిత్యవసరాలు అందించాలని అన్నారు. గత రెండేళ్లుగా దోమతెరలు పంపిణీ లేదని ఇప్పటికైనా ప్రభుత్వం జ్వరాల తీవ్రతను దృష్టిలో పెట్టుకొని మండలంలో ఉన్న ప్రతి కుటుంబానికి దోమతెరలు పంపిణీ చేయాలని అన్నారు. ప్రతి గ్రామంలో స్ప్రేయింగ్ చేయించాలని,ఏజీ కోడేరు కేంద్రంగా ఆ మూడు గ్రామాల సౌకర్యార్థం ఒక బోటు ఏర్పాటు చేయాలని తెలిపారు. అనంతరం డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని సబ్ కలెక్టర్ శుభం నొక్వాల్ కి అందించారు. అనంతరం సబ్ కలెక్టర్ మాట్లాడుతూ కేజీ కోడేరు లో నిత్యవసరాలు అందిస్తామని మిగతా గ్రామాలకు కూడా కలెక్టర్ దృష్టికి తీసుకుని వెళ్లి పరిష్కారానికి కృషి చేస్తానని, దోమతెరల పంపిణీకి కృషి చేస్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో సిపిఎం నాయకులు సిసం సురేష్,పొడియం లక్ష్మణ్, మొట్టమ్ రాజయ్య, కారం నాగేశ్వరరావు, కూర లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.