
రుద్రూర్, అక్టోబర్ 18 (పయనించే సూర్యుడు, రుద్రూర్ మండల ప్రతినిధి) :
రుద్రూర్ మండల కేంద్రంలో ఐకెపి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వారి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణ రెడ్డి శనివారం పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. రైతులు పండించిన ధాన్యాన్ని దళారులకు విక్రయించి మోసపోవద్దని, ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లోని ధాన్యాన్ని విక్రయించే దిగుబడి పొందాలని సూచించారు. కలెక్టర్ వెంట అడిషనల్ కలెక్టర్, తహశీల్దార్ తారాబాయి, వ్యవసాయ అధికారి సాయికృష్ణ, వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.