
పయనించే సూర్యుడు రిపోర్టర్ జల్లి నరేష్ చింతూరు డివిజన్ ఇంచార్జ్ జులై 24
చింతూరు మండలం కూమ్మూరు పంచాయతీ కూమ్మూరు గ్రామం లో వాటర్ ట్యాంక్ 2 లో రెండు రోజుల నుండి మంచి నీళ్లు రావడంలేదని స్థానిక సర్పంచ్ ముచ్చిక నాగార్జునకు మెట్ట గుంపు కు చెందిన రత్తయ్య తెలపడంతో వెంటనే ఇన్చార్జ్ సెక్రటరీ కి తెలపడంతో సంబంధిత శాఖ సచివాలయ ఇంజనీరింగ్ అసిస్టెంట్ వారికిత తెలియజేయడం జరుగుతుంది అని సెక్రెటరీ అన్నారు.సంబంధిత ఇంజనీరింగ్ అసిస్టెంట్ ఆ చోటుకు వెళ్లారా లేదా అనే వివరాలు గ్రామస్తులను అడిగి తెలుసుకుని స్థానిక సర్పంచ్ సంబంధిత అసిస్టెంట్ వారిని ఎక్కడైతే మోటార్ రిపేర్ అయిందో ఆ చోటుకు హాజరుకావాలని గ్రూప్ లో తెలిపినప్పటికీ హాజరుకాలేకపోవడంతో సర్పంచ్ ముచ్చిక నాగార్జున వెంటనే తన వాహనం వేసుకొని చింతూరు మండలం నుండి మెకానిక్ ను తీసుకొని వచ్చి తానే దగ్గర ఉండి వర్షంలో తడుస్తూ మెకానిక్ తో పాటు పనిచేస్తూ రిపేర్ చేయించారు.ఈ కార్యక్రమంలో గ్రామస్తులు సోడే రత్తయ్య.వినోద్ కుమార్.తదితరులు పాల్గొన్నారు.