
వాల్బాపూర్ మాజీ ఎంపిటిసి జీడీ దేవేందర్..
పయనించే సూర్యుడు // మార్చ్ // 19 // హుజురాబాద్ నియోజకవర్గ ఇన్చార్జ్ // కుమార్ యాదవ్..
నిరుద్యోగ యువతకు ఒక్క వరంగా..రాజీవ్ యువ వికాసం పథకం క్రింద కాంగ్రెస్ ప్రభుత్వం రుణాలు మంజూరు చేయనుందని, రేషన్ కార్డులో పేర్లు ఉన్న వారు మాత్రమే దరఖాస్తులకు అర్హులని వల్బాపూర్ గ్రామ యువతకు ఎంపీటీసీ దేవేందర్ తెలిపారు. దరఖాస్తులు ప్రారంభం: తేది :17-03-2025 నుండి05-04-2025 వరకు ఉంటుందని అన్నారు. దరఖాస్తులు అర్హులైన వారికి రుణాలు మంజూరు చేసే తేది 02-06-2025 వరకు రుణాలు మంజూరు చేస్తారని వివరించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ నిరుద్యోగ యువతకు 60 నుంచి 80 శాతం వరకు రాయితీలు ఉంటాయి అని ఒక్కో లబ్ధిదారుడికి రూ.4 లక్షల వరకు మంజూరు చేస్తారు అని ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని నిరుద్యోగ యువతకు తెలియజేశారు . ఆన్లైన్ దరఖాస్తులకు కావాల్సిన పత్రాలు:1. ఆధార్ కార్డు2. రేషన్ కార్డు3. ఆదాయ ధ్రువపత్రం4. కులం ధ్రువపత్రం 5. ఫొటో6. బ్యాంక్ అకౌంట్ బుక్7. ఫోన్ నెంబర్ తప్పనిసరి ఉండాలని సూచించారు.రేషన్ కార్డులో పేర్లు ఉన్న వారు ప్రతి ఒక్క నిరుద్యోగ యువత రాజీవ్ యువ వికాసం పథకం వినియోగించుకోవాలని కోరారు.