
పయనించే సూర్యుడు గాంధారి 28//08/25
ప్రమాదపు అంచున బ్రిడ్జ్ విద్యుత్ సరఫరా నిలిపారు వాగు దగ్గరలో ఉన్న పురాతన గంగమ్మ ఆలయం నేలమట్టమయింది పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేసిన అధికారులు కుండపోత వర్షం కారణంగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షానికి వాగు పక్కనే ఉన్న ఇంట్లో అకస్మాత్తుగా నీరు రావడంతో వాగు నీటి ఇద్దరు అందులో చిక్కుకున్నారు. వివరాలలోకి వెళితే గాంధారి మండలంలోని బ్రిడ్జి పక్కనే వద్ద ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్ సమీపంలో ఉన్నటువంటి ఇంట్లో కి నీరు రావడంతో కేకలు వేయగా అక్కడికి స్థానిక ఎస్సై ఆంజనేయులు చేరుకొని తన నడుముకు తాడు కట్టుకుని వెళ్లి ఒక మహిళను, ఇంకొకరిని స్థానికుల సహాయంతో పోలీసులు సహాయంతో బయటకు తీసుకువచ్చారు దీంతో ప్రాణాపాయం లేకుండా ఇద్దరుప్రమాదపు అంచున బ్రిడ్జ్ ఇది వరకు ఎప్పుడూ లేనంతలా బ్రిడ్జి కానుకొని ఉధృతంగా నీరు ప్రవహిస్తూ ఉండడంతో నీటి ప్రవాహం ఇలాగే కొనసాగితే బ్రిడ్జి ప్రమాదంలో ఉన్నట్టే అని స్థానికులు భావిస్తున్నారు. మునుపెన్నడూ లేనటువంటి వర్షాల కారణంగా గంగమ్మ గుడి కూడా కొట్టుకపోవడం జరిగింది. అంతేకాకుండా కామారెడ్డి నుంచి వచ్చే హెవీ విద్యుత్ స్తంభాలు నీటి ప్రవాహానికి వంగిపోవడంతో విద్యుత్ సరఫరా కూడా నిలిపివేయడం జరిగింది. వర్షం తగ్గుముఖం పడితే గాని కరెంట్ సరఫరా అయ్యే పరిస్థితి లేదు.పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసిన అధికారులు మండల కేంద్రంలోని శిథిలావస్థలో ఉన్న ఇండ్లలో ఉన్న వారి కోసం దాదాపు 100 మందికి పునరవాసం కల్పించేలా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. అయితే ఇందులో భాగంగా మండలంలోని జిల్లా పరిషత్ హై స్కూల్, మజీద్ వద్ద గల ప్రైమరీ స్కూల్ లను ఎంపిక చేసినట్లు అధికారులుగాంధారి కి చేరుకున్న రెస్క్యూటీమ్ గాంధారి మండలంలోని కుంట కట్టకింద చెరువు ఉపరితల భాగానికి నీరు రావడంతో ముందస్తు చర్యలుగా అధికారులు రెస్క్యూ టీం సిబ్బందిని అందుబాటులోకి తీసుకొని రావడం జరిగింది.ముందస్తుగా ప్రమాదవశాత్తు ఎలాంటి ప్రాణ నష్టం, ఆస్తి నష్టం జరగకూడదని తగు చర్యలు తీసుకుంటున్నారు.